సరెండర్ లీవ్ (SURRENDER LEAVE)

అర్జిత సెలవు నగదు కోసం అప్పగింత, సరెండర్ లీవ్ (SURRENDER LEAVE) సంబంధిత ఉత్తర్వులతో

✍️ అర్జితసెలవు(Earned Leave)* ఖాతాలో నిలువ వున్న సెలవులను కొన్ని షరతులకు లోబడి అప్పగించి (Surrender) దానికి ప్రతిఫలంగా నగదు పొందుటను *సరెండర్ లీవ్* అందురు.(G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)-(Govt.Circular Memo No.52729 Fin తేది:11-10-1969)

➤ ఇట్టి సౌకర్యం గజిటెడ్, నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.

➤ ప్రభుత్వ ఆర్ధిక సహాయం పొందుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం(ఎయిడెడ్) ఆధ్వర్యంలో పనిచేయుచున్న అన్ని పాఠశాలలు, కాలేజీలలో పనిచేయుచున్న ఉద్యోగులు సరెండర్ లీవ్ సదుపాయానికి అర్హులు.
(G.O.Ms.No.418 Edn తేది:18-04-1979)

➤ సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే. (G.O.Ms.No.306 Fin తేది:08-11-1974)

➤ సం॥ నకు 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు. (G.O.Ms.No.334 F&P తేది:28-09-1977)

➤ సరెండర్ లీవ్ కాలానికి పూర్తివేతనం, ఇతర అలెవెన్సులు మంజూరు చేయబడును. IR చెల్లించబడదు. (Govt.Memo.Mo.31948 F&P తేది:12-08-1998)

➤ సరెండర్ లీవ్ 15/30 రోజులకు 12/24 నెలల గ్యాప్ తో ఏ నెలలోనైనా అనుమతిస్తారు.ఈ సెలవుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులివాల్సిన అవసరం లేదు.
(Memo.No.14781-C/278/FR-1/2011 తేది:22-06-2011)
➤ ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారైతే అర్జిత సెలవు మంజూరుచేయు అధికారం కలిగియుంటాడో, అట్టి అధికారే అర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించవచ్చును.
(Para ii of G.O.Ms.No.238 Fin తేది:13-08-1969)

➤ అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదినుండి మాత్రమే, అర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేది నుండి అనుమతించకూడదు.
(Govt.Memo.No.47064/1164/FR-I/4-1 F&P తేది:25-09-1974)

➤ జనవరి 1వ తేదిన గాని,జూలై 1వ తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలోంచి ముందుగా సరెండర్ సెలవు తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు నమోదుచేయాలి.
(Govt.Memo.No.50978/1063/FR-I/79-1 తేది:22-11-1979)

➤ అర్జిత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో నుంచి GPF, ప్రభుత్వానికి చెల్లించే అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు తదితరములు తగ్గించకూడదు.

➤ సరెండర్ సెలవుకు సంబంధించిన సెలవు జీతం చెల్లించునపుడు ఇంటి అద్దె(HRA)మరియు ఇతర కాంపెన్సెటరీ అలవెన్సు లు కూడా చెల్లించాలి.
(Govt.Memo.No.64861/797/FR-II711 తేది:14-07-1972)

➤ ప్రభుత్వ క్వార్టర్ లలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ సెలవు జీతంతో HRA పొందుటకు అర్హులు.
(G.O.Ms.No.337 Fin తేది:29-09-1994)

➤ పదవీ విరమణ తేదికి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ సెలవు మంజూరుచేయవచ్చును. కాని అట్టివారికి మంజూరు చేయబడిన కడపటి తేదీకి, పదవీ విరమణ తేదికి డ్యూటీ పీరియడ్ కు 30 రోజులు తక్కువగాకుండా ఉండవలెను.
(G.O.Ms.No.131 F&P తేది:25-03-1976)

➤ పదవీ విరమణ/సర్వీసులో ఉంటూ మృతిచెందిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవును నగదుగా మార్చుకొను విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును.
(Govt Circular Memo No.9258-C/1768/FR-I/76-1 Fin తేది:31-01-1977)

➤ సరెండర్ సెలవు మంజూరైన తేదినుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కోసం సమర్పించాలి.* సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది.
(Govt Memo.No.271423/A2/97-1/ F&P తేది:18-08-1997)

➤ అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తి వివరములు ఉత్తర్వుల నంబరుతో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్రసిరాతో నమోదుచేయాలి. అలాగే సర్వీసు పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఏర్రసిరాతో నమోదుచేసి అటెస్ట్ చేయాలి.

➤ ఉపాధ్యాయులు ఇటీవల బదిలీలలో భాగంగా ఒక STO పరిధి నుండి మరొక STO పరిధిలోని పాఠశాలకు మారినపుడు సరెండర్ అప్లై చేసిన సందర్భంలో పాత STO కార్యాలయం నుండి Fly leap xerox కాపీని STO గారి Attestation to సమర్పించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *