ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలకపాత్ర పోషించే సర్వీసు రిజిస్టర్ ను ఎలా నిర్వహించాలి అందులో ఏయే అంశాలను పొందుపరచాలి అను విషయంలో కొంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాము
- ఫండమెంటల్ రూల్ 74కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 లో తెలియజేసిన పద్దతిలో సర్వీసు రిజిస్టరు నిర్వహించాలి.
(G.O.Ms.No.200 తేది:10-12-199)
- మొదటిపేజీ నందు ఉద్యోగి యొక్క పూర్తి పేరు తండ్రి పేరు,నివాస స్థలం,జాతీయత,పాస్ పోర్ట్ ఫోటో అంటించి సంబంధిత అధికారిచే అటేస్టేషన్ చేయించాలి.
- భవిష్యత్ లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు.
(G.O.Ms.No.165 F&P తేది:21-4-1984)
- మొదటపేజీ నందు ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ నమోదుచేయాలి.
(G.O.Ms.No.80 తేది:19-3-2008)
- మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(G.O.Ms.No.03 Fin తేది:08-01-1969)
- ఉద్యోగి వైవాహిక వివరాలు,కుటుంబ సభ్యుల వివరాలు నమోదుచేయాలి.
- సర్వీసు 2,3వ పేజీలలో ఉద్యోగి యొక్క వివరాలతో పాటు ఎత్తు,విద్యార్హతలు,సర్వీసులో చేరిన తర్వాత సంపాదించిన విద్యార్హతలు నమోదుచేయాలి.
- పదోన్నతి,ప్రమోషన్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం,పే ఫిక్సేషన్ తదితర వివరాలు నమోదుచేయాలి.
- ప్రతి ఉద్యోగి తన Home Town
(LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి.అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
*(APLTC Rule.No.8 of clause (b)(i))*
- ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
*(Govt.Memo.No.51073 తేది:19-12-2002)*
- ఉద్యోగి గుణగణాలు,శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
- ఉద్యోగికి సంబంధిoచిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం॥ పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి.
*(G.O.Ms.No.152 Fin తేది:20-5-1969)*
- NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి.బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు.
*(G.O.Ms.No.722 తేది:30-07-1966)*
*(G.O.Ms.No.391 తేది:07-11-1978)*
- సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు.
*(Govt.Memo.No.72246 తేది:30-07-1966)*
|
5 Comments
Comments are closed.