SechoolEdu
అప్రయత్నపదోన్నతులు - అర్హతలు - స్కేల్ వివరాలు 1

అప్రయత్నపదోన్నతులు – అర్హతలు – స్కేల్ వివరాలు

అప్రయత్నపదోన్నతులు - అర్హతలు - స్కేల్ వివరాలు 

💠 ఒక క్యాడర్లో 6సం. ల అర్హత గల సర్వీస్ పూర్తిచేసినప్పుడు స్పెషల్ గ్రేడ్ (SG) ఇస్తారు ఆర్డినరీ స్కేల్ తరువాతి గ్రేడ్ స్కేల్ తో ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు.

💠 ఒక క్యాడర్ లో 12సం. ల అర్హతగల సర్వీస్ పూర్తి చేసి తదుపరి ప్రమోషన్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉంటే ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో SPP-IA లో ఫిక్సేషన్ చెయ్యాలి. ఆస్కాలులో కనీస పే దాటి ఉంటే ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. తక్కువగా ఉంటే కనీస పే వద్ద ఫిక్సేషన్ చెయ్యాలి.

💠 ఒక క్యాడర్లో 18సం. ల అర్హత గల సర్వీస్ పూర్తిచేసి SPP-IA స్కేల్ పొందిన వారికి SPP-IB లో ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి.

💠 ఒక క్యాడర్ లో 24సం. ల అర్హతగల సర్వీస్ పూర్తి చేసి రెండవ ప్రమోషన్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉంటే ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఒక ఇంక్రిమెంట్ ఇస్తూ SPP-II లో ఫిక్సేషన్ చెయ్యాలి. SPP-II పొందిన తరువాత ప్రమోషన్ పొంది 6సం.ల సర్వీస్ పూర్తిచేసిన పిదప స్పెషల్ గ్రేడ్ (SG) ఇవ్వరాదు.

💠 RPS 2015  అప్రయత్న పదోన్నతులకు సంబందించిన G.O.Ms. No. 38 Dt. 15.04.2015 ప్రకారం సర్వీస్ రూల్స్ నందు రెగ్యులర్ ప్రమోషన్స్ కై అర్హతలలో మినహాయింపు ఉన్నట్లయితే SPP-IA / SPP -II కి కూడా వర్తిస్తుందని ఉంది.

 "Where Service Rules are relaxed to enable regular promotion, they should be automatically extended to the Automatic Advancement Scheme for purposes of extending the benefit of SPP-IA / SPP-II" కానీ ఇదేవిధంగా RPS 2010  అప్రయత్న పదోన్నతులకు సంబందించిన G.O.Ms. No. 93 Dt. 03.04.2010 నందు కూడా ఉంది.* "Where Service Rules are relaxed to enable regular promotion, they should be automatically extended to get the benefits under Automatic Advancement Scheme" 
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు మెమో నం. 034408/248/PC.II/2011 Dt. 04.02.2012 ప్రకారం SPP-II కి 50సం.లు వయస్సు నిండినవారికి డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవకుండా మినహాయింపుకు అనుమతించలేదు.

Related Articles