- 8,522
- Less than a minute
EOL సెలవులు
- ఉద్యోగికి ఏ సెలవు అందుబాటులో లేనప్పుడు (లేదా) ఇతర సెలవులున్నప్పటికి వ్రాతపూర్వకంగా అసాధారణ సెలవు మంజూరు కొరినప్పుడు ఈ సెలవును మంజూరు చేస్తారు.
- ఈ సెలవు కాలమును సీనియార్జీ. పదోన్నతులకు లెక్కిస్తారు. ఒకేసారి 5సం॥|లకు మించి ఈ సెలవులో ఉన్నచో ఉద్యోగము నుండి తొలగించబడినట్లు భావింపబడుతుంది.
- ఈ రకపు సెలవును 3సం|లకు వరకు పెన్షన్ను లెక్కలోనికి తీసుకుంటారు EOL కు సరిపడా దినములు ఇంక్రిమెంట్లు వాయిదాపడును.
- శాస్త్ర సాంకేతిక చదువుల నిమిత్తంగాని, అనారోగ్య కారణంగా గాని జీత నష్టపు సెలవు తీసుకొనినచో ఆరునెలలు వరకు డైరెక్టరు, ఆరునెలల పైబడినచో ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఇంక్రిమెంట్లు వాయిదా పడకుండా అనుమతించవచ్చు. (G.O.MS.No.214 F&P dt:3.9.96) ప్రకారం 5సం॥లు జీతము లేని సెలవుపై ప్రభుత్వ అనుమతి పాంది విదేశాలలో ఉద్యోగమునకు వెళ్లవచ్చును. పై చదువులకు వెళ్లదలచిన ఉద్యోగులకు వేతనముతోగాక EOL పై మాత్రమే అనుమతించబడినది. (Memo No. 13422/C/274/FR-1/2009 dt.21.5.2009)
- ప్రభుత్వ ఉద్యోగుల సెలవు విషయంలో 1933 నాటి సెలవుల నియమావళికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Ms.No.129 dt.1.6.2007) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 5-ఎ రూల్ తరువాత 5-బి రూల్ పేరుతో కలిసిన ఈ సవరణల ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి ఉద్యోగానికి గైర్హాజరైతే కూడా రాజీనామా చేసినట్లుగా భావిస్తారు. అయితే రాజీనామా చేసినట్లుగా పరిగణించడానికి ముందు కారణాలను వివరించేందుకు తగిన అవకాశం కల్పిస్తారు.