వెలువరించింది. ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అకడమిక్ ఇయర్ 2020-2021కు గాను మొత్తం 11 పరీక్షా పేపర్లను 6 పేపర్లుగా కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ప్రతిపాదనలను అనుసరించి ఈ ఆదేశాలు జారీచేశారు.
ఈ ఆరు పేపర్ల విధానం ఈ విద్యా సంవత్సరానికి(2020-2021) మాత్రమేనని తెలిపారు. నూతన విధానంలో ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మాథమెటిక్స్, జనరల్ సైన్స్(ఫిజిక్స్&బయాలజీ), సోషల్ స్టడీస్‌కు చెందిన పేపర్ -1, పేపర్-2లు ఒకే పరీక్షా పేపర్‌గా ఉండనున్నాయి. కాగా సెకండ్ లాంగ్వేజ్‌లో ఏ విధమైన మార్పు లేదు.
ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లిష్, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు ఒకే పరీక్ష ఉండేలా మార్పులు చేసింది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవ శాస్త్రాలకు వేర్వేరుగా సమాధాన పత్రాలుండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. అంతేకాకుండా ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డును విద్యాశాఖ ఆదేశించింది.
పరీక్ష రాసే సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటలకు పొడిగించారు. ఎప్పటిలాగే ఎఫ్ఏ పరీక్షలకు 20, బోర్డు పరీక్షలకు 80 మార్కులు ఉంటాయని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

