SechoolEdu
NEP 2020 breakfast for school children

NEP 2020: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా..!

విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించాలని నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులకై కొత్త జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. దీనిలో ప్రధానంగా.. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందించాలని పేర్కొంది. ఇటీవల కేంద్ర కేబినేట్ ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానం 2020లో దీన్ని ప్రతిపాదించారు.

 

ఉదయాన్నే బలమైన అల్పాహారాన్ని పిల్లలకు అందించడం వల్ల వారి మేధోశక్తిని పెంపొందించవచ్చునని పేర్కొంది. అందువల్ల అల్పాహారం కోసం నిబంధనలను చేర్చడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని సిఫార్సు చేసింది. పిల్లలు పోషకాహార లోపం లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు సరిగ్గా చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నారని తెలిపింది. కాబట్టే వారికి బలవర్ధమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయిచంది.

ఉదయాన్నే బలమైన అల్పాహారం పిల్లలకు అందిస్తే వారి మేధోశక్తి పెరగడానికి తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్టు పేర్కొంది. అందుకే ఇక నుంచి విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు శక్తినిచ్చే అల్పాహారాన్ని అందించాలని ప్రతిపాదించింది. వేడివేడి ఆహారం అందించలేని ప్రాంతాల్లో.. బెల్లంతో పాటు ఉడికించిన వేరు శెనగ, చెన్నా లేదా పండ్లను అందించవచ్చునని సూచించింది.

స్కూల్ విద్యార్ధులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని.. సంపూర్ణ టీకా విధానాన్ని కూడా పాటించాలని కేంద్రం తెలిపింది. అటు ప్రతీ విద్యార్థికీ హెల్త్ కార్డులను జారీ చేసి.. ఎప్పటికప్పుడూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుండాలని స్పష్టం చేసింది.

Related Articles