- 6,454
- Less than a minute
ప్రత్యేక ఆశక్తత సెలవు
- ఫండమెంటల్ రూల్ 83 ప్రకారం విధి నిర్వాహణ సందర్భంలో గాయపడి అశక్తులైన శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు ఈ సెలవు మంజూరుచేయబడుతుంది.
- సంఘటన జరిగిన మూడు నెలలలోగా అశక్తత స్పష్టమైన సందర్భంలోనే ఈ సెలవు మంజూరు చేయబడుతుంది. *[(Fundamental Rule-83(1)]*
- 24 నెలలకు మించకుండా వైద్యాధికారి సిఫారసు మేరకు ఈ ప్రత్యేక అశక్తత సెలవును మంజూరుచేయు అధికారం ప్రభుత్వానికే తప్ప ఏ ఇతర అధికారులకు లేదు.
- గజిటెడ్ ఉద్యోగుల విషయంలో అయితే మెడికల్ బోర్డు,NGO ల విషయంలో సివిల్ సర్జన్ సర్టిఫికెట్ జారిచేయాల్సి వుంటుంది. *[(Fundamental Rule-83(3)]*
- కాని సెలవు రెండు నెలలకు మించని పరిస్థితులలో ప్రభుత్వ వైద్యాధికారి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. *(G.O.Ms.No.40 Fin తేది:03-06-1991)*
- ఈ సెలవు ఇతర సెలవులతో కలిపి కూడా మంజూరుచేయవచ్చు.ఈ సెలవు ఏ సెలవు ఖాతా నుండి తగ్గించకూడదు.
- ఈ సెలవు కాలంలో ఉద్యోగులకు 120 రోజులకు పూర్తి జీతం.మిగితా కాలానికి సగం జీతం మంజూరుచేస్తారు.
- కార్యాలయం నుండి ఇంటికి,ఇంటి నుండి కార్యాలయానికి వేళ్ళుచున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల అశక్తతకు గురియైతే ఈ సెలవు మంజూరు చేయడానికి వీలులేదు.
- కాని ఒక కార్యాలయం నుండి మరోక కార్యాలయానికి,కోర్టుకో లేక ఫీల్డులో కార్యస్థానమునకు వెళ్ళు సందర్భంలో ప్రమాదానికి గురై అశక్తులైన ఉద్యోగులు ఈ సెలవుకు అర్హులు. *(G.O.Ms.No.133 F&P తేది:19-06-1991)
1 Comment
Comments are closed.