SechoolEdu
Service Book Info in telugu

Service Book Information In Telugu


సర్వీసు రిజిస్టరు-నిర్వాహణ అంశాలు

ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలకపాత్ర పోషించే సర్వీసు రిజిస్టర్ ను ఎలా నిర్వహించాలి అందులో ఏయే అంశాలను పొందుపరచాలి అను విషయంలో కొంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాము

  1. ఫండమెంటల్ రూల్ 74కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 లో తెలియజేసిన పద్దతిలో సర్వీసు రిజిస్టరు నిర్వహించాలి.
    (G.O.Ms.No.200 తేది:10-12-199)
  2. మొదటిపేజీ నందు ఉద్యోగి యొక్క పూర్తి పేరు తండ్రి పేరు,నివాస స్థలం,జాతీయత,పాస్ పోర్ట్ ఫోటో అంటించి సంబంధిత అధికారిచే అటేస్టేషన్ చేయించాలి.
  3. భవిష్యత్ లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు. (G.O.Ms.No.165 F&P తేది:21-4-1984)
  4. మొదటపేజీ నందు ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ నమోదుచేయాలి. (G.O.Ms.No.80 తేది:19-3-2008)
  5. మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి. (G.O.Ms.No.03 Fin తేది:08-01-1969)
  6. ఉద్యోగి వైవాహిక వివరాలు,కుటుంబ సభ్యుల వివరాలు నమోదుచేయాలి.
  7. సర్వీసు 2,3వ పేజీలలో ఉద్యోగి యొక్క వివరాలతో పాటు ఎత్తు,విద్యార్హతలు,సర్వీసులో చేరిన తర్వాత సంపాదించిన విద్యార్హతలు నమోదుచేయాలి.
  8. పదోన్నతి,ప్రమోషన్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం,పే ఫిక్సేషన్ తదితర వివరాలు నమోదుచేయాలి.
  9. ప్రతి ఉద్యోగి తన Home Town (LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి.అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి. *(APLTC Rule.No.8 of clause (b)(i))*
  10. ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి. *(Govt.Memo.No.51073 తేది:19-12-2002)*
  11. ఉద్యోగి గుణగణాలు,శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
  12. ఉద్యోగికి సంబంధిoచిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం॥ పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి. *(G.O.Ms.No.152 Fin తేది:20-5-1969)*
  13. NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి.బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు. *(G.O.Ms.No.722 తేది:30-07-1966)* *(G.O.Ms.No.391 తేది:07-11-1978)*
  14. సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు. *(Govt.Memo.No.72246 తేది:30-07-1966)*

సర్వీస్ బుక్ రిజిష్టర్ నిర్వహణ నియమాలు పద్దతులు

  1. ఒక వేళ ఉద్యోగి సర్వీసు పుస్తకం పోయినట్లు అయితే DDO గారే పూర్తి భాధ్యత వహిస్తారు. కొత్తది ఓపెన్ చేయాలి అంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. డూప్లికట్ బుక్ గాని Xerox సహాయం తో కొత్తది ఓపెన్ చేయవచ్చు.
  2. ఒక ఆఫీస్ లో చాలా మంది ఉద్యోగులు ఉంటే, వారి యొక్క సర్వీసు పుస్తకాలు ను వారి ఇంక్రీ మెంట్ ల నెల ప్రకారం బీరువా లో పెట్టుకోవడం వల్ల పని సులభం అవుతుంది.
  3. ఎప్పుడైనా ఉద్యోగికి సర్వీసు పుస్తకం ఇవ్వ వలసిన అవసరం ఏర్పడితే, ఉద్యోగి నుండి ఒక అర్జి పత్రం ( అప్లికేషన్ ఫారం ) తీసుకోవడం తప్పని సరి మరియు అతనికి ముట్టినట్టుగా డిక్లరేషన్ తీసుకోవాలి.
  4. ఉద్యోగులు సర్వీస్ రిజిష్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి , ఒక వేళ పట్టక పోతే చిన్నగా రాయాలి . అని వార్య కారణాల వల్ల ఏదైనా ప్రొసీడింగ్స్ లో తప్పులు జరిగినట్లు అయితే సర్వీస్ రిజిష్టర్ లో రాయబడిప్పుడు దానిని కొట్టివేయకూడదు. మళ్ళీ తప్పులు సరి చేస్తూ మరొక ప్రొసీడింగ్స్ తీయాలి.
  5. ఉద్యోగులు తమ సర్వీస్ రిజిష్టర్ ను తాము స్వతహాగా రాసుకోపోవడం మంచిది. ఎవరైనా నియమాలు తెలిసిన వారితో గాని లేదా వారి సమక్షంలో రాసుకోవడం మంచిది. తప్పులు దొర్లకుండా ఉంటుంది.
  6. ఉద్యోగులు తమ అర్హతలను హాల్ టికెట్ నంబర్ తో సహా సర్వీస్ రిజిష్టర్ లో నమోదు చేయించుకోవాలి.
  7. బీరువాలో ఉన్న ఉద్యోగి సర్వీస్ రిజిష్టర్ ను సులభంగా గుర్తు పట్టుటకు బుక్ సైడ్ కు ఉద్యోగి పేరు ఎంప్లాయ్ ID రాయడం మంచిది .
  8. ఉద్యోగి తన ఉద్యోగం లోకి చేరిన తర్వాత అనగా అర్హతల కు మించి చదివినచో ఆ అర్హత వివరాలను హాల్ టికెట్ నంబర్ తో సహా అన్ని రిజిష్టర్ లో నమోదు చేయాలి.
  9. ప్రతి సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం లో ఎంత కట్ అయ్యింది ఎపుడు మినహాయింపు వివరాలను నమోదు చేయాలి.
  10. ఒక వేళ ఉంటే రివర్షన్ వివరాలు ( 2009 లో కొన్ని జిల్లాలలో ప్రమోషన్ ఇచ్చి తర్వాత పోస్ట్ లు లేనందున తిరిగి రివర్షన్ లు ఇచ్చారు ).
  11. ఒక వేళ ఇంక్రిమెంట్ లు నిలుపుదల చేస్తే ఆ వివరాలు నమోదు చేయాలి.
  12. చైల్డ్ కేర్ సెలవులను తీసుకున్నా ప్రతిసారీ నమోదు చేయాలి మరియు బ్యాలెన్స్ గా ఉన్న సెలవులు నమోదు చేయాలి.
  13. దీర్ఘ కాలిక సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి.
  14. ఉన్నత విద్య కోసం తీసుకున్న సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి. ( SC, ST లకు కుటుంబంలో మొదటి తరం వారికి ఉన్నత విద్య కోసం రెండు సం ల ఆన్ డ్యూటీ ఇస్తారు )
  15. అడ్వాన్స్ డిటైల్స్ ( ఇంటి నిర్మాణం, కార్ లోన్, కంప్యూటర్, పెళ్లి కొరకు తీసుకొనే అడ్వాన్స్ వివరాలు, ఈ అడ్వాన్స్ లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడును )
  16. రాష్ట్ర స్థాయి లో గాని లేదా జాతీయ స్థాయిలో గాని ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డ్ లు గాని, రివార్డ్ లు గాని ప్రశంసా పత్రాలు గాని, సేవా పథకాలు గాని మెడల్స్ గాని పొందినట్లు అయితే ఆ వివరాలు నమోదు చేయాలి.

Related Articles

5 Comments

Avarage Rating:
  • 0 / 10
  • Dhoke hanmanthrao , April 23, 2020 @ 2:20 pm

    Thank you sir

  • NAGARAJU GOLKONDA , April 24, 2020 @ 4:14 am

    సార్ నమస్కారం
    సర్వీస్ బుక్కుల నిర్వహణ గురించి చక్కటి సమాచారం అందించారు మీకు ధన్యవాదాలు మరింత సమాచారాన్ని ఇలా అందిస్తూ ఉండండి టెలిగ్రామ్ ద్వారా తెలుసుకుంటాం.
    ఉంటాము.

  • Vijaykumar , April 30, 2020 @ 12:20 am

    Good information about service book

  • Dr.T.seetharam , August 11, 2020 @ 6:06 am

    Good information sir.thank .you

  • Yakubali Shaik , October 30, 2020 @ 9:08 am

    Thanks for ur kind information

Comments are closed.