SechoolEdu
IBPS PO Recruitment 2020, Apply for 1167 Probationary Officer Posts at ‘ibps.in’ Institute of Banking Personnel Selection, IBPS has released the notification for IBPS PO 2020 recruitment examination on ibps.in.

IBPS PO Recruitment 2020, 1167 Probationary Officer Posts

ఐబీపీఎస్‌ 1167 ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ ‌(ఐబీపీఎస్‌).. 2021-22 సంవ‌త్స‌రానికి గాను కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా 1167 ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 5, 2020 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆగస్టు 26, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థుల వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌https://www.ibps.in/ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 1167

  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- 734
  • పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌- 83
  • యుకో బ్యాంక్‌- 350

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వ‌య‌సు: 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ (ప్రిలిమిన‌రీ, మెయిన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థలకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.175.

ముఖ్య తేదీలు:

  • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.08.2020
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.08.2020
  • ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: అక్టోబ‌రు 3, 10, 11
  • మెయిన్ ప‌రీక్ష తేది: 28.11.2020
  • ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రి 2021
  • వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Related Articles